Wednesday, July 9, 2008

మా క్లాసుమేట్స్ మీట్

బ్లాగ్ లో కొత్త టపా వ్రాయడానికి చాలా రోజుల తరువాత నాకు కొద్దిగా సమయం దొరికింది, క్రిందటి వారాంతము, మా క్లాసు మేట్స్ అందరం మేము చదువుకున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి లో మళ్ళి చాల రోజుల తరువాత కలిసాము. నాతొ పాటు మా మరో ముగ్గురు క్లాసు మేట్స్ , పూణే లోనే పని చేస్తున్నారు, కాబట్టి, అందరం కలిసి ఒకే సారిగా బయలుదేరాము తిరుపతికి ... చదువుకునే రోజుల తీపి జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ ... వీడు ఇపుడు ఎలా ఉంటాడో, వాడు ఇపుడెలా ఉంటాడో అనుకుంటూ ... బయలుదేరాం ... నిజమే, మనకు కావలిసిన వాళ్ళని, చాలారోజుల తరువాత కలవడంలోని ఆనందం, ఆ భావన వేరు ...
దాదాపు, ఓ ఇరవై గంటలు ప్రయాణం చేసిన తరువాత, తిరుపతికి చేరాము. శనివారం మధ్యాహ్నం అందరం కలిసాము. మా క్లాసు లో మొత్తం ఇరవై ఎనిమిది మంది అందులో ఏడు మంది అమ్మాయిలు. ఐతే ... పన్నెండు మంది వచ్చారు... మీట్ కి అందులో అంతా అబ్బాయిలే. మీట్ కి లీడ్ చేసే నేను, భారీ అంచనాలతోనే బయలుదేరాను. బయలుదేరే ముందు, అమ్మాయిల కి ఫోన్ చేస్తే, సారీ రహమాన్, రాలేము, ఏమి అనుకోవద్దు అని చల్లగా చావు కబురు చెప్పారు. తీరా కారణం అడిగితె, ఓ మంచి న్యూస్ చెప్పారనుకోండి, అది వేరే విషయం. న్యూస్ ఏంటంటే, పెళ్ళయిన వాళ్ళల్లో ముగ్గురు కార్ర్యింగ్ అని. నాకేమో వీళ్ళంతా మాట్లడుకోని ప్రెగ్నెంట్ అయినట్లు అనిపించింది అపుడు ... :). కొందరు ... వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోయారు, కొందరు టికెట్స్ బుక్ చేసుకొని ... చివరి నిమిషంలో వాళ్ళ మేనేజర్ వదలక రాలేకపోయారు ...

దాదాపుగా మా క్లాసు లో అందరం మంచి పొసిషన్స్ లో సెటిల్ అయ్యాము ... పలకరింపులు ఐన తరువాత, మా ప్రొఫెస్సొర్స్ ని కలిసి, మేమంతా ఏమి చేస్తున్నామో ఎక్కడున్నామో చెప్పుకొని, బయటపడ్డాం. మాకంటే ముందొచ్చిన వాళ్లు మార్నింగ్ ఫోటో సెషన్ కానిచ్చి ... మధ్యాహ్న భోజనానికి ఓ మాంచి హోటల్ కి వెళ్ళాము ... బాగా లాగిచ్చి, మళ్ళి కాంపస్ కి వెళ్లి అక్కడ, ఎవడైనా, మా బ్యాత్చు వాడు కనిపిస్తాడేమోనని చూస్తువున్నాము ... ఫిజిక్స్ వాళ్ళు చాలామంది అక్కడే పిహెచ్డి చేస్తున్నారు అక్కడే... సో వాళ్ళని కలిసి ... మరి కాంపస్ లో ఈవెనింగ్ ఫోటో సెషన్ కానిచ్చి, ఆరోజు కి ఇక చాలు అనుకోని లాడ్జి కి బయలుదేరాము ... సాయంత్రం, చంద్రగిరి కోటకి పోదాం అనే ప్లాన్ తో వచ్చాం కానీ, సమయాభావం వాళ్ళ కుదరలేదు. మళ్ళి ప్లాన్ మార్చి, సినిమా కి వెళ్దాం అని అనుకున్నాం. సెకండ్ షో కి ప్లాన్ చేసారు మవాల్లంతా. రాత్రి భోజనానికి హోటల్ కి వెళ్ళకుండా... బయట బడ్డి కొట్టు దగ్గర, దోస, ఇడ్లీ లాగించాము. ఆహా, అలా తిని ఎన్ని రోజులైందో ... మా ఎమ్మెస్సీ చదివే రోజులు గుర్తుకొచ్చాయి. అక్కడ ఓ ఫోటో సెషన్ కానిచ్చి ... ఇహ మూవీ కని కలిసి కట్టుగా బయలు దేరాము ... అంతలో నే ఒక ఫోన్ కాల్ మావాడు ఇంకొక్కడు వస్తున్నాడు అని ... వాడ్ని పిలుచుకొని వచ్చి ... వాడితో కొద్ది సేపు మాట్లాడి, సినిమా కి బయలుదేరాము. దార్లో రెడీ సినిమాకి ప్లాన్ చేసారంతా. ఎమ్మెస్సీ లో ఉన్నపుడు కూడా ఇలాగె, ఏ సినిమా కెల్లాలి అనేది దార్లోనే డిసైడ్ చేసేవాళ్ళం. రోజంతా తిరిగి బాగా అలిసి పోయాం కాబట్టి ... నేను, మరో ఇద్దరు ఓ కునుకేసేసాము హాల్లోనే. శనివారం అల గడిచిపోయింది

ఆదివారం ఉదయమే అంతా రెడీ అయి, గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము. దర్శనమంతా చేసుకొని. కొద్దిసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకొని. మిగతావాళ్ళ గురించి తెలుసుకొని .... తరువాత ప్లాన్ ఏమిటని అనుకోని మెల్లగా బయటకోచ్చాము. అప్పటికి పూణే నుంచి వచ్చిన వాళ్ళు బయలు దేరే సమయం ఆసన్నమైంది ... సో అంతా భోజనానికి భిమాస్ హోటల్ కెళ్ళి ... భోంచేసి ... మేము తిరుగు ప్రయాణం పట్టం పూణే ... కి

మొత్తానికి, మా మీట్ మాకు ఓ తీపి గుర్తుగా మిగిలింది... మా తరువాతి మీట్. నెక్స్ట్ ఇయర్ లో జూలై లో గాని లేకుంటే ఆగష్టు లో కాని ఉండొచ్చు ... మీట్ నుంచి వచ్చిన తరువాత నాకు ఆఫీసు కి రావలనిపించలేదు ... సో ఒక రోజు లీవ్ ... తీసుకొని ... హాయిగా రూమ్ లో గడిపి ... మరుసటి రోజు ఆఫీసు కొచ్చిన ... ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలింగ్ ... :(. ఏదైతే ఏముంది ... మేమందరం ఇప్పటికి ... మెయిల్స్ లో ప్రతి రోజు కాంటాక్ట్ లో ఉంటాము ... పైగా మా క్లాసు మేట్స్ అందరికోసం ఓ గ్రూప్ కూడా ఉంది. అందులోనే మేము మా ఫ్రెండ్స్ పుట్టిన రోజు, పెళ్లి రోజు గ్రీటింగ్స్ చెప్పుకుంటాము ... :)

చెప్పడం మర్చిపోయాను కదా ... మేము అంతా మూడు సంవత్సరముల క్రితం ఎస్వియు లో ఎమ్మెస్సీ, ఎలేక్ట్రోనిచ్స్ చదువుకున్నాము ... ఇపుడంతా ... ఐటి సెటిల్ అయ్యాం ...

మా క్లాస్మేట్స్ మీట్ ఫోటోలు ఇక్కడ పొందుపరచాను ... క్రింది లంకెను క్లిక్ చెయ్యండి ...
http://picasaweb.google.com/rahaman.naik/SVUMeet05July2008