Tuesday, December 15, 2009

జై సమైఖ్యాంధ్ర

సిగ్గులేని జనాల్లారా ....
మనసులేని మృగాల్లారా ....
మానవత్వం మరిచినారా .... ?
మెదడులేని మేధావుల్లారా ....

తల్లిని తిడితే పడే సంస్కార హీనులారా ...
మత్తులోని మునిగారా .... ?
బాధ్యతలను విస్మరించినారా .... ??

తెలుగు తల్లి తల్లడింపు వినలేరా ... ?
కనలేరా ... !!
కుతంత్రాలను కనిపెట్టలేరా ... !!

లేవండి .... లేవండి ..... లేచి కదలిరండి ....
నిదురించిన .... సోదరులను ... లేపి మరీ కదలండి ...
జూలు విదిల్చిన ... సింహంలా ... ఝఘించి ...
తెలుగు నేల పౌరుషం తడాఖా ... చూపించండి ...


కుళ్ళు రాజకీయాలకు ఎదురు నిలబడండి ...
రక్తం ధారపోసైన ... సమైఖ్యాంధ్రను సాధించండి

ఉద్యమాన్ని పూని, ఉప్పెనై లేచి ప్రాంతీయవాదాన్ని పూకటి వేళ్ళతో పెకలించండి ...
కష్టించి ... శ్రమించి ... సాందించిన గడ్డను అల్పులకు ధారపోయకండి ...

రాష్ట్రాన్ని విడగొట్టి, దేశాన్ని తగలబెట్టి ...
సాధించే స్మశానాన్ని ఏలుకునే కుక్కల్ని ...
గోతి కాడ నక్కల్ని
తరిమి ... తరిమి ... కొట్టండి ...

పచ్చటి మన గడ్డమీద మొలిచిన ఈ కలుపు మొక్కలని,
నేడే తగలబెట్టండి

నేడు ఉన్నది మన ఆంధ్ర
అందరిది ఈ ఆంధ్ర
ఉహించినది స్వర్ణాంధ్ర
చెయ్యొద్దు స్మశానాంధ్ర
స్థాపించాలి విశ్వ విజయ విశాలాంద్ర ....

ప్రాంతాలు వేరు అయిన మనమందరం ఒక్కటేనని నేడు చాటి చెప్పండి
ప్రతి ఒక్కడు చేతులెత్తి తెలుగు తల్లికి జై కొట్టండి ....
తెలుగు నేల పుట్టినందుకు తలఎత్తుకు తిరగండి

కాదని మొరిగే ఊరకుక్కలని చెప్పుతో కొట్టండి
తగు రీతిన సత్కరించి గట్టిగా బుద్ది చెప్పండి

కేంద్రం ... కేంద్రం .... అని మొరిగే కాంగ్రేసుకు తోక కత్తిరించి ...
తెలుగుదేశం పేరిట వెన్నుపోటు నాయుడుకి నడ్డి విరగ్గకొట్టి ...
తెలంగాణా రాష్ట్ర సమితి కేసిఆర్ కి పళ్ళు రాలగొట్టి ...
మర్పుకోసమంటూ వచ్చిన చిరంజీవికి చిచ్చుపెట్టి ...
సిగ్గులేని బిజెపి ని మట్టుబెట్టి ...
మొత్తం రాజకీయానికీ స్వస్తి చెప్పి ...
తిరిగి రానీయకుండా శాశ్వత సమాది కట్టి ...

తెలుగు తల్లి కన్నీటిని తుడుద్దాం ...
ఆ చల్లటి తల్లి ముంగిట నిలుద్దాం ...
సోదరులమై జీవిదాం ....
వసుధైక కుటుంబాన్ని స్థాపింద్దాం ...

జై సమైఖ్యాంధ్ర ... జై జై ... సమైఖ్యాంధ్ర
జై తెలుగు తల్లి ... జై జై తెలుగు తల్లి ...

Wednesday, July 9, 2008

మా క్లాసుమేట్స్ మీట్

బ్లాగ్ లో కొత్త టపా వ్రాయడానికి చాలా రోజుల తరువాత నాకు కొద్దిగా సమయం దొరికింది, క్రిందటి వారాంతము, మా క్లాసు మేట్స్ అందరం మేము చదువుకున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి లో మళ్ళి చాల రోజుల తరువాత కలిసాము. నాతొ పాటు మా మరో ముగ్గురు క్లాసు మేట్స్ , పూణే లోనే పని చేస్తున్నారు, కాబట్టి, అందరం కలిసి ఒకే సారిగా బయలుదేరాము తిరుపతికి ... చదువుకునే రోజుల తీపి జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ ... వీడు ఇపుడు ఎలా ఉంటాడో, వాడు ఇపుడెలా ఉంటాడో అనుకుంటూ ... బయలుదేరాం ... నిజమే, మనకు కావలిసిన వాళ్ళని, చాలారోజుల తరువాత కలవడంలోని ఆనందం, ఆ భావన వేరు ...
దాదాపు, ఓ ఇరవై గంటలు ప్రయాణం చేసిన తరువాత, తిరుపతికి చేరాము. శనివారం మధ్యాహ్నం అందరం కలిసాము. మా క్లాసు లో మొత్తం ఇరవై ఎనిమిది మంది అందులో ఏడు మంది అమ్మాయిలు. ఐతే ... పన్నెండు మంది వచ్చారు... మీట్ కి అందులో అంతా అబ్బాయిలే. మీట్ కి లీడ్ చేసే నేను, భారీ అంచనాలతోనే బయలుదేరాను. బయలుదేరే ముందు, అమ్మాయిల కి ఫోన్ చేస్తే, సారీ రహమాన్, రాలేము, ఏమి అనుకోవద్దు అని చల్లగా చావు కబురు చెప్పారు. తీరా కారణం అడిగితె, ఓ మంచి న్యూస్ చెప్పారనుకోండి, అది వేరే విషయం. న్యూస్ ఏంటంటే, పెళ్ళయిన వాళ్ళల్లో ముగ్గురు కార్ర్యింగ్ అని. నాకేమో వీళ్ళంతా మాట్లడుకోని ప్రెగ్నెంట్ అయినట్లు అనిపించింది అపుడు ... :). కొందరు ... వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోయారు, కొందరు టికెట్స్ బుక్ చేసుకొని ... చివరి నిమిషంలో వాళ్ళ మేనేజర్ వదలక రాలేకపోయారు ...

దాదాపుగా మా క్లాసు లో అందరం మంచి పొసిషన్స్ లో సెటిల్ అయ్యాము ... పలకరింపులు ఐన తరువాత, మా ప్రొఫెస్సొర్స్ ని కలిసి, మేమంతా ఏమి చేస్తున్నామో ఎక్కడున్నామో చెప్పుకొని, బయటపడ్డాం. మాకంటే ముందొచ్చిన వాళ్లు మార్నింగ్ ఫోటో సెషన్ కానిచ్చి ... మధ్యాహ్న భోజనానికి ఓ మాంచి హోటల్ కి వెళ్ళాము ... బాగా లాగిచ్చి, మళ్ళి కాంపస్ కి వెళ్లి అక్కడ, ఎవడైనా, మా బ్యాత్చు వాడు కనిపిస్తాడేమోనని చూస్తువున్నాము ... ఫిజిక్స్ వాళ్ళు చాలామంది అక్కడే పిహెచ్డి చేస్తున్నారు అక్కడే... సో వాళ్ళని కలిసి ... మరి కాంపస్ లో ఈవెనింగ్ ఫోటో సెషన్ కానిచ్చి, ఆరోజు కి ఇక చాలు అనుకోని లాడ్జి కి బయలుదేరాము ... సాయంత్రం, చంద్రగిరి కోటకి పోదాం అనే ప్లాన్ తో వచ్చాం కానీ, సమయాభావం వాళ్ళ కుదరలేదు. మళ్ళి ప్లాన్ మార్చి, సినిమా కి వెళ్దాం అని అనుకున్నాం. సెకండ్ షో కి ప్లాన్ చేసారు మవాల్లంతా. రాత్రి భోజనానికి హోటల్ కి వెళ్ళకుండా... బయట బడ్డి కొట్టు దగ్గర, దోస, ఇడ్లీ లాగించాము. ఆహా, అలా తిని ఎన్ని రోజులైందో ... మా ఎమ్మెస్సీ చదివే రోజులు గుర్తుకొచ్చాయి. అక్కడ ఓ ఫోటో సెషన్ కానిచ్చి ... ఇహ మూవీ కని కలిసి కట్టుగా బయలు దేరాము ... అంతలో నే ఒక ఫోన్ కాల్ మావాడు ఇంకొక్కడు వస్తున్నాడు అని ... వాడ్ని పిలుచుకొని వచ్చి ... వాడితో కొద్ది సేపు మాట్లాడి, సినిమా కి బయలుదేరాము. దార్లో రెడీ సినిమాకి ప్లాన్ చేసారంతా. ఎమ్మెస్సీ లో ఉన్నపుడు కూడా ఇలాగె, ఏ సినిమా కెల్లాలి అనేది దార్లోనే డిసైడ్ చేసేవాళ్ళం. రోజంతా తిరిగి బాగా అలిసి పోయాం కాబట్టి ... నేను, మరో ఇద్దరు ఓ కునుకేసేసాము హాల్లోనే. శనివారం అల గడిచిపోయింది

ఆదివారం ఉదయమే అంతా రెడీ అయి, గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాము. దర్శనమంతా చేసుకొని. కొద్దిసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకొని. మిగతావాళ్ళ గురించి తెలుసుకొని .... తరువాత ప్లాన్ ఏమిటని అనుకోని మెల్లగా బయటకోచ్చాము. అప్పటికి పూణే నుంచి వచ్చిన వాళ్ళు బయలు దేరే సమయం ఆసన్నమైంది ... సో అంతా భోజనానికి భిమాస్ హోటల్ కెళ్ళి ... భోంచేసి ... మేము తిరుగు ప్రయాణం పట్టం పూణే ... కి

మొత్తానికి, మా మీట్ మాకు ఓ తీపి గుర్తుగా మిగిలింది... మా తరువాతి మీట్. నెక్స్ట్ ఇయర్ లో జూలై లో గాని లేకుంటే ఆగష్టు లో కాని ఉండొచ్చు ... మీట్ నుంచి వచ్చిన తరువాత నాకు ఆఫీసు కి రావలనిపించలేదు ... సో ఒక రోజు లీవ్ ... తీసుకొని ... హాయిగా రూమ్ లో గడిపి ... మరుసటి రోజు ఆఫీసు కొచ్చిన ... ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలింగ్ ... :(. ఏదైతే ఏముంది ... మేమందరం ఇప్పటికి ... మెయిల్స్ లో ప్రతి రోజు కాంటాక్ట్ లో ఉంటాము ... పైగా మా క్లాసు మేట్స్ అందరికోసం ఓ గ్రూప్ కూడా ఉంది. అందులోనే మేము మా ఫ్రెండ్స్ పుట్టిన రోజు, పెళ్లి రోజు గ్రీటింగ్స్ చెప్పుకుంటాము ... :)

చెప్పడం మర్చిపోయాను కదా ... మేము అంతా మూడు సంవత్సరముల క్రితం ఎస్వియు లో ఎమ్మెస్సీ, ఎలేక్ట్రోనిచ్స్ చదువుకున్నాము ... ఇపుడంతా ... ఐటి సెటిల్ అయ్యాం ...

మా క్లాస్మేట్స్ మీట్ ఫోటోలు ఇక్కడ పొందుపరచాను ... క్రింది లంకెను క్లిక్ చెయ్యండి ...
http://picasaweb.google.com/rahaman.naik/SVUMeet05July2008

Wednesday, June 11, 2008

కవిత: ఎండుటాకు

ఇపుడే తెలిసివస్తుంది ... నాకు
పెళ పెళ లాడుతూ ....
ఎటు గాలి వీస్తే అటు ....
గాలి వాటంగా .... నా పయనం ...
గమ్యం ఎటో తెలియదు.... నాకు .....
ఇపుడే తెలిసివస్తుంది ... నాకు
కాలి కింద పది ... పర పర ... లాడుతూ ...
చిద్రమై ... వికలమై ....
అనాధనైనాను .. నేను ...
ఇపుడే తెలిసివచ్చింది ... నాకు ... నేను ... ఎండుటాకు నని ...

Saturday, June 7, 2008

జుహు బీచ్ పర్యటన


నేను పని చేసేది పూణే లో ఐన ... వీకేండ్స్ లో ముంబాయి లేదా ... నాసిక్ వేలుతుంటాను. క్రితం వీకెండ్ నేను ముంబాయి వెళ్లాను. అక్కడ మా స్నేహితులతో కలిసి జుహు బీచ్ కి వెళ్ళాము.
వారాంతం కాబట్టీ .... చాలా ఎక్కువ మంది వచ్చారు ... అది బీచ్ అనే దాని కన్నా ... ఏదో ఒక ఎగ్జిబిషన్ అనొచ్చు. అలా వచ్చారు ... జనం.
మా స్నేహితులు తానే లో ఉంటాను కాబట్టీ ..., మేము మధాహ్నం మూడు గంటలకు బయలుదేరాము. ముందుగ తానే స్టేషన్ కెళ్ళి, అక్కడి నుంచి, లోకల్ ట్రైన్ పట్టుకొని, దాదర్ వెళ్లి, అట్నుంచి మళ్ళి వెనక్కి సంతక్రుజ్ కి వచ్చి మరి అక్కడి నుంచి ... లోకల్ బస్ జుహు బీచ్ కి వెళ్ళాము ... జుహు బీచ్ కి వేల్లెపాటికి టైం ఐదయ్యింది .... హమ్మయ్య ... చేరాంర బాబు జుహు బీచ్ కి అనుకొని ... ఇక తిరగడం స్టార్ట్ చేసాము .... ఫోటోలు దిగడం స్టార్ట్ చేసాము ... మా డొక్కు మొబైల్ కెమేరాతో ... పర్లేదు ... ఫోటోలు బానే వచ్చాయి ... :)
మేము జుహు బీచ్ కి చేరాం ర భగవంతుందా అనుకునే లోపే ... జనం తండోపతండాలుగా ... వచ్చేసారు .... :( వారిని చూసి తెరుకునేలోపే ... సూర్యుడు ... ఆ రోజుకి బై చెప్పే టైం అయ్యింది ... ఇక ఇలాగే ఉంటే లాభం లేదు అని ... మనం కూడా అందరితో పాటు విజ్రుంభించాము ... ఇక చూసుకో నా సామీ రంగా .... మన తెలుగోడి దెబ్బ ... అని .... ఒకటే గోల ... గోల .... ఒకటే అరుపులు ....
ఇక ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ... ప్రేమికులు, కొత్తగా పెళ్ళయిన జంటలు వుంటారు .... వారాంతం కాబట్టీ .... ఫామిలీస్ ఎక్కువగా వచ్చాయి .... పాపం .... ప్రేమికులకు ఇది కొద్దిగా ఇబ్బందికర విషయమే .... ఎందుకంటే వారి ఏకాంతానికి భంగం కలిగించినట్లే కదా... ఐన ... కొన్ని జంటలు ఇవి ఏమి పట్టనట్లుగా ... వారి కార్యకలాపాలను ... సాగిస్తూ కనిపించారు .... వారిని చూసి ... మన వాళ్లు ... సొల్లు కార్చుకోవడం మొదలెట్టేసారు .... ఎంతైనా ... మన .... సంప్రదాయానికి ... ఇక్కడి సాంప్రదాయానికి ... నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా.

ఇక అక్కడ ఫోటోలు దిగి .... కొబ్బరిబొండాలు ... లాగించి .... కొద్దిసేపు .... అక్కడ బీచ్ లో కూర్చొని ... ఇహ పదరా బాబు అనుకుంటూ .... బయలుదేరి ... మధ్యలో ... నాకేదో ... ఆలోచన వచ్చి ఆగి ... మరి వెనక్కి వచ్చి .... ఐస్ గోల ... అమ్మే .... చోటికి వెళ్లి నిలబడ్డాము ... అందరం ... బాబు ... మూడు బట్టర్ స్కత్చ్ ఐస్ గోల ... ఇవ్వు అని ఆర్డర్ చేసి ... నుంచున్నాము ... ఒ ఐదు నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చాడు .... నా సామీ రంగ ... తింటుంటే ... ఏమి చెప్పమంతారండి .... ఆ రుచి .... చెప్పడం మరిచాను ... ఐస్ గోల ముంబాయి లో తినాలంటే .... జుహ్ బీచ్ లోనే తినాలి .... ఐస్ గోల ... ముంబాయి లో ఫేమస్ ఐటెం మరి .... జుహు బీచ్ కి వచ్చి ఐస్ గోల తినకుంటే వచ్చమంటే ... జనాలు నవ్వుతారు ...

చలో మరి ... నెక్స్ట్ వీక్ మరినే డ్రైవ్ బీచ్ కి వెళుతున్నాము ... దాని విషయాలు వచ్చే వారం ....