Saturday, June 7, 2008

జుహు బీచ్ పర్యటన


నేను పని చేసేది పూణే లో ఐన ... వీకేండ్స్ లో ముంబాయి లేదా ... నాసిక్ వేలుతుంటాను. క్రితం వీకెండ్ నేను ముంబాయి వెళ్లాను. అక్కడ మా స్నేహితులతో కలిసి జుహు బీచ్ కి వెళ్ళాము.
వారాంతం కాబట్టీ .... చాలా ఎక్కువ మంది వచ్చారు ... అది బీచ్ అనే దాని కన్నా ... ఏదో ఒక ఎగ్జిబిషన్ అనొచ్చు. అలా వచ్చారు ... జనం.
మా స్నేహితులు తానే లో ఉంటాను కాబట్టీ ..., మేము మధాహ్నం మూడు గంటలకు బయలుదేరాము. ముందుగ తానే స్టేషన్ కెళ్ళి, అక్కడి నుంచి, లోకల్ ట్రైన్ పట్టుకొని, దాదర్ వెళ్లి, అట్నుంచి మళ్ళి వెనక్కి సంతక్రుజ్ కి వచ్చి మరి అక్కడి నుంచి ... లోకల్ బస్ జుహు బీచ్ కి వెళ్ళాము ... జుహు బీచ్ కి వేల్లెపాటికి టైం ఐదయ్యింది .... హమ్మయ్య ... చేరాంర బాబు జుహు బీచ్ కి అనుకొని ... ఇక తిరగడం స్టార్ట్ చేసాము .... ఫోటోలు దిగడం స్టార్ట్ చేసాము ... మా డొక్కు మొబైల్ కెమేరాతో ... పర్లేదు ... ఫోటోలు బానే వచ్చాయి ... :)
మేము జుహు బీచ్ కి చేరాం ర భగవంతుందా అనుకునే లోపే ... జనం తండోపతండాలుగా ... వచ్చేసారు .... :( వారిని చూసి తెరుకునేలోపే ... సూర్యుడు ... ఆ రోజుకి బై చెప్పే టైం అయ్యింది ... ఇక ఇలాగే ఉంటే లాభం లేదు అని ... మనం కూడా అందరితో పాటు విజ్రుంభించాము ... ఇక చూసుకో నా సామీ రంగా .... మన తెలుగోడి దెబ్బ ... అని .... ఒకటే గోల ... గోల .... ఒకటే అరుపులు ....
ఇక ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ... ప్రేమికులు, కొత్తగా పెళ్ళయిన జంటలు వుంటారు .... వారాంతం కాబట్టీ .... ఫామిలీస్ ఎక్కువగా వచ్చాయి .... పాపం .... ప్రేమికులకు ఇది కొద్దిగా ఇబ్బందికర విషయమే .... ఎందుకంటే వారి ఏకాంతానికి భంగం కలిగించినట్లే కదా... ఐన ... కొన్ని జంటలు ఇవి ఏమి పట్టనట్లుగా ... వారి కార్యకలాపాలను ... సాగిస్తూ కనిపించారు .... వారిని చూసి ... మన వాళ్లు ... సొల్లు కార్చుకోవడం మొదలెట్టేసారు .... ఎంతైనా ... మన .... సంప్రదాయానికి ... ఇక్కడి సాంప్రదాయానికి ... నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా.

ఇక అక్కడ ఫోటోలు దిగి .... కొబ్బరిబొండాలు ... లాగించి .... కొద్దిసేపు .... అక్కడ బీచ్ లో కూర్చొని ... ఇహ పదరా బాబు అనుకుంటూ .... బయలుదేరి ... మధ్యలో ... నాకేదో ... ఆలోచన వచ్చి ఆగి ... మరి వెనక్కి వచ్చి .... ఐస్ గోల ... అమ్మే .... చోటికి వెళ్లి నిలబడ్డాము ... అందరం ... బాబు ... మూడు బట్టర్ స్కత్చ్ ఐస్ గోల ... ఇవ్వు అని ఆర్డర్ చేసి ... నుంచున్నాము ... ఒ ఐదు నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చాడు .... నా సామీ రంగ ... తింటుంటే ... ఏమి చెప్పమంతారండి .... ఆ రుచి .... చెప్పడం మరిచాను ... ఐస్ గోల ముంబాయి లో తినాలంటే .... జుహ్ బీచ్ లోనే తినాలి .... ఐస్ గోల ... ముంబాయి లో ఫేమస్ ఐటెం మరి .... జుహు బీచ్ కి వచ్చి ఐస్ గోల తినకుంటే వచ్చమంటే ... జనాలు నవ్వుతారు ...

చలో మరి ... నెక్స్ట్ వీక్ మరినే డ్రైవ్ బీచ్ కి వెళుతున్నాము ... దాని విషయాలు వచ్చే వారం ....

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. వీలయితే ఫోటోలు జత చేయండి.

    ReplyDelete
  3. నాగరాజ గారు ...
    ఫొటోస్ అప్లోడ్ చేశాను. చూసి చెప్పండి ... కృతజ్ఞతలు ... మీ వ్యాఖ్యలకు ...

    ReplyDelete
  4. అబ్బే బీచ్లో ఐస్ కన్నా బజ్జీలే బాగుంటాయి! లేదా చక్కని పిడత కింద కాలుతున్న మరమరాలతో చేసిన మసాలా అయినా సరే ;)

    ReplyDelete